‘శ్యామ్ సింగ‌రాయ్’ షూటింగ్ షురూ

Director Shiva Nirvana, Latest Tollywood News, Nani Kick Starts Shoot Of Shyam Singha Roy, Nani Shyam Singha Roy, Natural Star Nani, Natural Star Nani Movie, Natural Star Nani Movie Latest News, Shyam Singha Roy, Shyam Singha Roy Movie, Shyam Singha Roy Movies Launch, Shyam Singha Roy Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా ఇటీవలే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ను మొద‌లుపెట్టాడు నాని. శ్యామ్ సింగ‌రాయ్ లొకేష‌న్ లో స్క్రిప్ట్ బుక్ తోపాటు కాఫీ క‌ప్‌, ప‌క్క‌నే నాని ఛైర్ పై కూర్చున్న స్టిల్ ను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. తుఫాను వ‌చ్చే ముందు నిశ్శ‌బ్దం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మ‌‌డోన్నా సెబాస్టియ‌న్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అందిస్తున్నాడు.

దీనితో పాటు శివనిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్‌ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుండగా.. . థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + three =