శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ’డర్టీ హరి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫ్రైడే మూవీస్ ఏటిటిలో విడుదలైన ఈ చిత్రం 24 గంటల్లో 91818 వ్యూస్ దక్కించుకుంది. ఒక్క టికెట్ తీసుకుంటే ఎంతమంది ఎన్నిసార్లైనా 24 గంటల టైమ్‌లో చూసే ఏర్పాటు ఫ్రైడే మూవీస్ ఏర్పాటు చేసింది. అది మీ స్నేహితులతో కానీ.. కుటుంబంతో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా.. కంప్యూటర్, మొబైల్, ట్యాబ్ ఇలా ఎందులో అయినా చూసుకునే అవకాశం కల్పించారు ఫ్రైడే మూవీస్. ఈ నేపథ్యంలో ఇప్పుడు విడుదలైన డర్టీ హరీ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమాకు మంచి టాక్ రావడంతో వ్యూస్ మరింతగా పెరుగుతాయని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు.
కాగా ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు కూడా ఈసినిమాకు అందించారు. గూడూరి శివరామకృష్ణ, గూడురు సతీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా… మార్క్.కె.రాబిన్ సంగీతం అందించాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: