‘V’ – జనవరి 1న థియేటర్ లో

Actor Sudheer Babu, Actor Sudheer Babu Latest Movie Updates, Actor Sudheer Babu Latest News, Hero Sudheer Babu, Latest Tollywood News, Sudheer Babu About V Movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, V Movie, V Movie Telugu Movie, V Movie To Release In Theaters, V movie to release in theaters for new year, V Movie Updates

కరోనా ప‌రిస్థితుల కార‌ణంగా సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టంతో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిన్నగా థియేటర్స్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో పలు సినిమాలు మళ్లీ థియేటర్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమా న్యూ ఇయర్ కు థియేటర్ లోకి వస్తుండగా.. ఇప్పుడు మరో సినిమా కూడా థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. ఆ సినిమా మరేదో కాదు నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘వి’ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వి సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అయిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మంచి టాక్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కొత్త సంత్స‌రం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న ‘వి’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేద థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + seven =