రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో ‘థ్యాంక్ యు బ్రదర్’ టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను, అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్‌ల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి అనసూయ విభిన్నమైన పాత్రతో వస్తుందని తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు థ్యాంక్ యూ బ్రదర్ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇక మోషన్ పోస్టర్ లో గ్రౌండ్ లో భయంకరమైన శబ్ధాలు వస్తుండగా అనసూయ, అశ్విన్ లిఫ్ట్‌లో ఇరుక్కొని భయంతో చూస్తుంటారు. మరి పోస్టర్లలోనే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.
Happy to present the official motion poster of #ThankYouBrother! Looks thrilling! Wishing the entire team huge success 😊@Raparthy @anusuyakhasba @viraj_ashwin @JustOrdinaryEnthttps://t.co/M9CqobM01n
— Mahesh Babu (@urstrulyMahesh) December 24, 2020
కాగా జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, బాబీ రాఘవేంద్ర, సమీర్ నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: