బిగ్ బాస్ 4 – రెండోసారి కెప్టెన్ అయిన నోయ‌ల్‌

Noel Sean Becomes Captain For Second Time In Bigg Boss 4 Show

బిగ్ బాస్ 4.. మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్నటి కంటే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకా కష్టమైన టాస్క్ లు ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఏడో డీల్‌ గా త‌ల‌, గ‌డ్డం స‌గం గీసుకోవాలి. అయితే ఈ టాస్క్ మాత్రం రెండు టీమ్స్ చేయమని చెప్పేసరికి బిగ్ బాస్ కూడా క్యాన్సిల్ చేసాడు. ఎనిమిదో డీల్‌ గా పేడ క‌లిగిన బాత్‌ట‌బ్‌లో దిగాలి. అఖిల్ గంట మోగించ‌డంతో అత‌ని టీమ్‌లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వ‌చ్చింది. తొమ్మిదో డీల్‌ గా ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అర‌టి ప‌ళ్ల‌ను తినాలి. అరియానా గంట మోగించ‌డంతో అభిజిత్‌ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కానీ ముఖానికి అంతా అవసరం లేదని కాస్త అతి తెలివి ప్ర‌ద‌ర్శించగా… ఈ లోపు అవినాష్ ముఖానికంత‌టికీ క‌ప్పేసుకుని అర‌టిపండు నోటిలో కుక్కుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప‌దో డీల్‌ గా గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక కుర్చీలో ఒక స‌భ్యుడు కూర్చుని ఉండాల్సి ఉంటుంది. మిగ‌తావాళ్లు అత‌డిని లేపే వ‌ర‌కు వాష్ చేస్తుండాలి. అఖిల్ బెల్ కొట్టడంతో ఆ గ్రూప్ నుండి అఖిల్ ఈ టాస్కు చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక రెడ్ టీం అతనిని కుర్చీ నుండి దింపేందుకు చాలా సేపు ప్రయత్నించారు. అయితే అఖిల్‌ను ఇబ్బంది పెడుతున్నాడ‌ని నోయ‌ల్ అన‌డంతో అవినాష్ ఇది టాస్క్‌లో భాగ‌మ‌ని సీరియ‌స్ అయ్యాడు. ఇక క‌ళ్ల‌లోకి షాంపూ పోతుంద‌ని మోనాల్ నీళ్లు గుమ్మ‌రించ‌డంతో అభి, మెహ‌బూబ్ ఏం చేస్తున్నావ‌ని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇక ఈ విషయంలో సోహైల్ కు అవినాష్ కు మధ్య చిన్న ఆర్గుమెంట్ కూడా జరిగింది. దివి ట‌బ్‌లో నుంచి ఒక‌సారి దిగిన‌ప్పుడు కూడా ఏమీ చేయ‌లేద‌ని.. సంచాల‌కుడిగా నువ్వు క‌రెక్ట్ కాద‌ని అనేశాడు. ‘బిగ్‌బాస్..‌ ‌ఇలానే జ‌రిగితే నేను టాస్కులు ఆడ‌ను, కావాలంటే ఎలిమినేట్ చేసేయండి, నాకు క్లారిటీ లేక‌పోతే బాగోదు’ అని వార్నింగ్ ఇచ్చాడు. ‘దీంతో సోహైల్‌కు కోపం వ‌స్తోంద‌ని గ్ర‌హించిన అఖిల్ అత‌డిని ప‌క్క‌కు తీసుకువెళ్లాడు. కానీ ఆవేశం ప‌ట్ట‌లేక‌ చేయిని కుర్చీకి బాదుకున్నాడు.

ప‌ద‌కొండో డీల్‌ గా ఎవ‌రైనా ఒక‌రు త‌రువాతి వారం నేరుగా నామినేట్ అవ్వాలి. అఖిల్ ముందుగా గంట కొట్ట‌డంతో అత‌ని టీమ్‌లో నుంచి నోయ‌ల్ నామినేట్ అవుతాన‌ని చెప్పాడు. ఇంత‌టితో డీల్స్ ముగిసిపోగా అఖిల్ ‘రెడ్’ టీమ్ గెలిచిన‌ట్లు సోహైల్ ప్ర‌క‌టించాడు. కెప్టెన్సీ పోటీదారుల‌కు “కొట్టు- త‌ల‌తో ఢీ కొట్టు” అనే టాస్క్ ఇచ్చాడు. దీనికి అవినాష్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. త‌ల‌కు బ్యాటు క‌ట్టుకుని వారికి కేటాయించిన‌ క‌ల‌ర్ బాల్స్‌ను నెట్‌లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో నోయ‌ల్ గెల‌వ‌డంతో అత‌డు రెండోసారి కెప్టెన్ అయ్యాడు. కానీ అమీతుమీ టాస్క్‌లో నేరుగా నామినేట్ అయినందున త‌ర్వాతి వారంలో అత‌డికి ఇమ్యూనిటీ ల‌భించ‌ద‌ని బిగ్‌బాస్ స్ప‌ష్టం చేశాడు. దీంతో నోయ‌ల్ త‌ర్వాతి వారం నామినేష‌న్ నుంచి త‌ప్పించుకోలేక‌పోయాడు.

మరి ఇంకా రెండు రోజులు ఉంది ఓటింగ్ కు. ఈ గ్యాప్ లో ఎన్ని ఈక్వేషన్స్ మారిపోతాయో.. ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారో చూడాలంటే మాత్రం వీకెండ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.