దసరాకు “వకీల్ సాబ్ “మూవీ ట్రీట్ ?

Vakeel Saab Movie Team To Give Special Treat To Pawan Kalyan Fans For Dussehra Festival

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ఫిలిమ్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అంజలి , నివేద థామస్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. 6 నెలల తరువాత “వకీల్ సాబ్ “మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. దాదాపుగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “వకీల్ సాబ్ “మూవీ లో పవన్ కళ్యాణ్ వర్క్ కొంత బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా , హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మగువా మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు “వకీల్ సాబ్ “మూవీ అప్ డేట్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు దసరా పండగ సందర్భంగా మంచి ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. “వకీల్ సాబ్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.