వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అనిల్ రావిపూడి ఎఫ్ 3 ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు జనవరి 2021 నుంచి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ లోపు వరుణ్, వెంకీ సినిమాలు కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత ఎలాగూ అనిల్ తక్కువ టైంలోనే సినిమాను పూర్తి చేస్తాడు కాబట్టి.. 5 నెలల్లోనే షూటింగ్ ను కంప్లీట్ చేసి వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నట్టు సమాచారం.
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ఈ సీక్వెల్ లో సునీల్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక కీలకమైన పాత్ర కోసం సునీల్ ను అడగటం జరిగిందట. ఏదో కొద్దిసేపు మాత్రమే కాకుండా… ఇద్దరు హీరోలతో కలిసి సినిమా మొత్తం సునీల్ పాత్ర ఉండేలా క్యారక్టర్ ను డిజైన్ చేస్తున్నాడట అనిల్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
టాలీవుడ్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కమెడియన్ కమ్ హీరో సునీల్. గోదావరి యాసలో మాట్లాడుతూ.. ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించాడు. సొంతం, నువ్వునాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, ఎలా చెప్పను, ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ చేసిన మరిచిపోలేని.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ హీరోగా కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు సునీల్. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కథ అందిస్తున్న ఈ సినిమాకు ‘వేదాంతం రాఘవయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: