గుణశేఖర్ “శకుంతలమ్ “మూవీ విశేషాలు

Guna Sekhar Shakunthalam Movie Team Releases Some Interesting Updates.

“లాఠీ ” మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన గుణశేఖర్ “సొగసు చూడతరమా ” మూవీ తో విజయం సాధించారు. గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీ నటులతో రూపొందిన “రామాయణం “మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన “చూడాలని ఉంది “, “ఒక్కడు “, “రుద్రమదేవి ” వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. “ఒక్కడు “మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా గుణశేఖర్ నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 5 సంవత్సరాల తరువాత గుణశేఖర్ తన కొత్త మూవీ ని అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహాభారతం ఆదిపర్వం లోని ఒక ప్రేమ కథ గా “శకుంతలమ్ ” మూవీ రూపొందిస్తున్నట్టుగా దర్శకుడు గుణశేఖర్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ .. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నాననీ , రాజు దుష్యంత్, శకుంతల ప్రేమకథగా హిమాలయాల బ్యాక్ డ్రాప్ లో “శకుంతలమ్ ” మూవీ తెరకెక్కనుందనీ , ఈ మూవీ మేజర్ షూటింగ్ పార్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కంప్లీట్ అవుతుందనీ , స్క్రిప్ట్ రెడీ చేయడానికి 8 నెలల సమయం పట్టిందనీ , శకుంతల క్యారెక్టర్ కు అందంగా , యాక్టింగ్ స్కిల్స్ ఉన్న హీరోయిన్ కై వేచిచూస్తున్నాననీ , “హిరణ్య కశ్యప ” మూవీ తెరకెక్కించాలంటే ఎక్కువమంది అవసరం అవుతారనీ , కరోనా టైమ్ లో అంతమంది తో వర్క్ చేయడం కష్టం కనుక “శకుంతలమ్ ” మూవీ ని రూపొందిస్తున్నాననీ గుణశేఖర్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 13 =