ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు తెచుకున్నాడు. బాలీవుడ్ సినిమా చిచోరేలో కనిపించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కనిపించిన ఈ సినిమాలో నవీన్, తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగులో నవీన్ పోలిశెట్టి తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో జాతి రత్నాలు అనే కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇకఇదిలా ఉండగా నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ వెబ్ సిరీస్ రూపొందుతుందని టాక్ వినబడుతుంది. కొరటాల శివ నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుందట. అమెజాన్ ప్రైమ్ కోసం నిర్మితమవుతున్న ఈ సినిమాకి కొరటాల శివ కథ అందిస్తున్నాడని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవి కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు బాలకృష్ణ సినిమాలో కూడా తను నటించడం లేదని.. తెలుగులో జాతి రత్నాలు సినిమా కాకుండా మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయని.. హిందీలో కూడా ఒక సినిమా చేస్తున్నాడని తెలిపాడు.
ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: