నవంబర్ లో “విరాటపర్వం ” షూటింగ్

Rana Daggubati Latest Film Virata Parvam Movie Shooting To Resume In November

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా నక్సలైట్ నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా “విరాట పర్వం “మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితా దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో రానా , హీరోయిన్ సాయి పల్లవి ఉద్యమ కారులుగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా నిలిచిపోయిన “విరాట పర్వం “మూవీ షూటింగ్ నవంబర్ లో పునః ప్రారంభం కానుంది. 90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన “విరాట పర్వం “మూవీ షూటింగ్ ఈ షెడ్యూల్ తో కంప్లీట్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రానా , సాయి పల్లవి , ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “విరాట పర్వం “మూవీపై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన “అరణ్య ” మూవీ విడుదలకు సిద్ధంగాఉంది. హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరీ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − ten =