800 పై క్లారిటీ – ఈ సినిమాకు.. రాజకీయాలకు సంబంధం లేదు

800 Movie Team Gives Clarification About The Film Plot

శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మరోవైపు విజయ్ సేతుపతి కూడా బౌలింగ్ గురించిన మెళకువలు నేర్చుకుంటున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో ముత్త‌య్య‌గా విజ‌య్ లుక్ చూసి ఒక రకంగా అందరూ షాకయ్యారు. ముత్త‌య్య మురళీధరన్ లుక్ ను దించేశాడు విజ‌య్‌

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై ఇప్పుడు వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తుండటంపై విజయ్ సేతుపతిపై నెటిజన్లు తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ‌లంక‌లో చాలామంది త‌మిళులు అణ‌చివేత‌కు గుర‌వుతున్నారు. అలాంటి దేశానికి సంబంధించిన వ్య‌క్తిపై బ‌యోపిక్ తీయ‌డం, అందులో ఓ త‌మిళ హీరో న‌టించ‌డం వాళ్ల‌కు న‌చ్చ‌డం లేదు. అంతేకాదు పొలిటికల్ గా ఈ సినిమాను చూపించనున్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రయూనిట్ వీటిపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ఫుల్ స్పోర్ట్స్ నేపథ్యంలోనే తెరకెక్కుతోందని.. రాజకీయాలకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. తమిళ్ నాడు నుండి శ్రీలంకకు వలస వచ్చిన ఒక మనిషి లెజెండ్రీ క్రికెటర్ గా ఎలా అయ్యాడు అనేది చూపిస్తున్నాం.. ఎన్నో కలలతో ఉన్న యంగర్ జనరేషన్ కు స్ఫూర్తి దాయకంగా ఉండేలా తీస్తున్నాం అని తెలిపారు. తమిళ్-శ్రీలంక కు మధ్య ఉన్న వివాదాల గురించి కానీ వారి సంసృతుల గురించి ఎలాంటి సీన్స్ చూపించడం లేదని ప్రెస్ నోట్ ద్వారా స్పష్టం చేశారు.

కాగా సౌత్ స్టార్, తమిళ హీరో విజయ్ సేతుపతికి దక్షిణ భారతదేశంలో ఓ ప్రత్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తరచూ విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ.. విమర్శకుల ప్రశంసలు పొందే ఈ స్టార్.. ఈ సారి వివాదంలో చిక్కుకున్నారు. మరి చిత్ర యూనిట్ ఇచ్చిన ఈ క్లారిటీతో అయిన విషయం సద్దుమణుగుతుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 3 =