హారర్ థ్రిల్లర్ మూవీలో సమంత

Samantha Akkineni Once Again To Act In A Thriller Movie After Raju Gari Gadhi 2

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత నెగటివ్ రోల్ లో నటించిన “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ” వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత సేంద్రియ పద్ధతి లో పంటలు పండిస్తున్నారు. ఆ పంటల ఫొటోస్ తో అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోనీ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “ఓ బేబీ ” మూవీ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో ఒక హారర్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ కి మొదట దర్శకుడిగా అశ్విన్ శరవణన్ ను ఎంపిక చేసినా అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి ఆయన తప్పుకొనడంతో, నందిని రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వ బాధ్యత ను చేపట్టారు. వినూత్న కథ తో రూపొందనున్న ఈ మూవీ జనవరి లేదా ఫిబ్రవరి నెలలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. దర్శకురాలు నందిని రెడ్డి , హీరోయిన్ సమంత కాంబినేషన్ లో రూపొందిన “జబర్దస్త్ “, “ఓ బేబీ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + nineteen =