బిగ్ బాస్ 4 – కెప్టెన్ గా అరియనా హౌస్ నుండి బయటికి వెళ్లిన నోయెల్

Bigg Boss 4 Day 53 : Check out the top highlights from Ariyana Becoming The House Captain To Noel Leaving The House

బిగ్ బాస్ 4 – నిన్న ఎపిసోడ్ స్టార్టింగే నోయల్ అనారోగ్యంతో బాధపడటం చూపించారు.
అర్ధ‌రాత్రి దాటినా అనారోగ్యం కారణంగా నిద్ర పట్టకపోవడంతో కాస్త కన్నీరు పెట్టుకున్నాడు. ఇక పొద్దున్నే లేచిన తర్వాత అభి, నోయ‌ల్, హారిక ఒక దగ్గర కూర్చొని వుంటారు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న మోనాల్ ను చూసి మోనాల్ ఒంటెలా న‌డుస్తుంద‌ని అడగగా.. మ‌రి నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చున్నావ‌ని నోయ‌ల్ అభికి కౌంటర్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వెంటనే బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ చేశాడు. ఇక 8వ వారం కెప్టెన్సీ టాస్క్ కేవలం ఆడవాళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. “ఆడ‌వాళ్ల‌కు మాత్ర‌మే” అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక యాపిల్ చెట్టు, దానిపై పోటీదారుల ఫొటోలు అతికించి ఉన్నాయి. దానిప‌క్క‌నే ఒక డ‌బ్బా అందులో క‌త్తి, దాని తాళం ఉన్నాయి. మూడుసార్లు బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు అబ్బాయిలు ఆ తాళ‌పుచెవిని సంపాదించి న‌చ్చిన అమ్మాయికి ఇవ్వొచ్చు. అప్పుడు ఆమె తాళంచెవి సాయంతో డ‌బ్బాలోని క‌త్తి తీసుకుని ఎవ‌రు కెప్టెన్ అవ‌డానికి వీల్లేద‌ని భావిస్తారో ఆమె ఫొటో అతికించి ఉన్న యాపిల్‌ను తెంపి ముక్క‌లు ముక్క‌లుగా కోయాల్సి ఉంటుంది.

ఈ టాస్క్‌లో మొద‌ట తాళ‌పు చెవిని ద‌క్కించుకున్న అఖిల్‌ను మోనాల్‌కే ఇచ్చాడు. ఆ తర్వాత లాక్ ఓపెన్ చేసిన మోనాల్‌.. హారిక‌ కెప్టెన్సీకు అర్హురాలు కాదంటూ ఆమె ఫొటో ఉన్న పండును ముక్కలుగా చేసింది. త‌ర్వాత తాళ‌పు చెవిని ద‌క్కించుకున్న మెహ‌బూబ్ దాన్ని అరియానాకు ఇచ్చాడు. అరియానా.. లాస్య ‌ఫొటో ఉన్న పండును కట్ చేసింది. త‌ర్వాత కీ చేజీక్కించుకున్న మాస్ట‌ర్ దాన్ని అరియానాకు ఇవ్వ‌గా ఆమె మోనాల్‌ను పండును కట్ చేసింది. దీంతో అరియానా 8వ వారం కెప్టెన్‌ అయింది. ఇక కెప్టెన్ అయిన అరియనా రేషన్ మేనేజర్ గా మోనాల్ ను సెలెక్ట్ చేసింది. దీంతో మాస్ట‌ర్ ముఖం మాడ్చుకున్నాడు. నామినేష‌న్‌లో ఉన్న‌ప్పుడు రేష‌న్ మేనేజ‌ర్‌గా ఇస్తే త‌న‌కు స‌పోర్ట్ అయ్యేద‌ని… అస‌లు తాను మోనాల్‌కు స‌పోర్ట్ చేసి ఉండాల్సింద‌ని, నీకు విశ్వాసం లేద‌ని అరియానా పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగెత్తిన అరియానా.. రేష‌న్ మేనేజ‌ర్‌గా ఉంటే సేవ్ అవుతార‌ని ఎక్క‌డా లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఆ తర్వాత అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ నోయ‌ల్‌ను వైద్యులు ప‌రీక్షించారు. ఇక నోయల్‌ను కన్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. స్పెష‌లిస్టుల స‌ల‌హా మేర‌కు మ‌రింత మెరుగైన వైద్యం అందుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోవాల‌ని సూచించాడు. అయితే త్వ‌ర‌లోనే పూర్తి ఆరోగ్య‌వంతులై తిరిగి రావాల‌న్నాడు. ఇక నోయల్ వెళ్లిపోతుండటంతో హారిక చాలా ఫీల్ అయి ఏడ్చేసింది. అందరూ దగ్గరుండి నోయల్ ను పంపించారు.

మరి ఈవారం నామినేషన్ లో ఆరుగురు వున్నారు. వారిలో ఎవరు ఇంటికి వెళతారు.. నోయల్ బయటికి వెళ్లిన కారణంగా ఎలిమినేషన్ తీసేస్తారా ఉంచుతారా లాంటి విషయాలు తెలియాలంటే రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =