ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రైటర్ , డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా నూతన దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ “నాంది -ఎ న్యూ బిగినింగ్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ , నవమి , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కామెడీ చిత్ర హీరో అల్లరి నరేష్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. అల్లరి నరేష్ ఇప్పుడు ఒక ప్రయోగాత్మక కథతో రూపొందిన “నాంది ” మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ “నాంది ” మూవీపై ఆసక్తిని కలిగించాయి. “నాంది ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరో అల్లరి నరేష్ 57 వ మూవీగా “నాంది -ఎ న్యూ బిగినింగ్ ” తెరకెక్కింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: