మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరో గా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దియా మీర్జా , సయామీ ఖేర్ కథానాయికలు. హీరో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో అతుల్ కులకర్ణి , అలీ రెజా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు “వైల్డ్ డాగ్” మూవీ 70శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమారు 7 నెలల తరువాత కరోనా జాగ్రత్తలతో “వైల్డ్ డాగ్” మూవీ షూటింగ్ హిమాలయాలలో పునః ప్రారంభం అయ్యింది. మనాలి పరిసర ప్రాంతాలలో దర్శకుడు సాల్మన్ , హీరో నాగార్జున పై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. హిమాలయాల్లో “వైల్డ్ డాగ్” మూవీ టీమ్ స్వేఛ్చ ను , ప్రకృతిని ప్రేమిస్తూ అంటూ షూటింగ్ లొకేషన్ ఫోటోలను హీరో నాగార్జున సోషల్ మీడియా లో షేర్ చేశారు. హీరో నాగార్జున ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తూ “వైల్డ్ డాగ్” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: