కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గతం’. సైకలాజికల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాను మొత్తం అమెరికాలోనే మూడు నెలలపాటు షూటింగ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిన్ననే ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా.. మిస్టరీ గా ఉందని ప్రశంసిస్తూ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించాడు సత్యదేవ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ లో చూసినట్లయితే యాక్షన్, రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మరి ట్రయిలర్ ను చూస్తుంటే సినిమా ఎంత థ్రిల్లింగ్ గా ఉండబోతుందో అర్థమవుతుంది’. మరి మీరు కూడా కింద వీడియో క్లిక్ చేసి ‘గతం’ ట్రైలర్ ను చూసేయండి..
Gripping and mysterious. Congratulations @kiran_twytter, @bpoldaz and team, the trailer looks very promising https://t.co/OunC8Gv3W6
All the best Srujan. #GathamOnPrime, Nov 6, @PrimeVideoIN@rakesh_galebhe #PoojithaKuraparthi @SricharanPakala @off_beat_films@SOriginals1— Satya Dev (@ActorSatyaDev) October 30, 2020
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చే నెల అంటే నవంబర్ 6వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆఫ్ బీట్ ఫిలిమ్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు ఈ సినిమాను నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: