శాకాహారి గానే కొనసాగుతా -రకుల్ ప్రీత్ సింగ్

I will continue to be a vegetarian says rakul preet singh.

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యమిస్తూ రకుల్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం 2 హిందీ , “ఇండియన్ 2 “(తమిళ ), నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్ “మూవీ లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ జంటగా రూపొందిన మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక సంవత్సరం క్రితం రకుల్ శాకాహారిగా మారిన విషయం తెలిసిందే. శాకాహారి రకుల్ మాట్లాడుతూ .. యోగా , మెడిటేషన్ లతో పాటు శాకాహారిగా మారడంతో తన జీవన విధానం మారిపోయిందనీ , శాకాహారి గా మారాలనే తన నిర్ణయం తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అనీ , నెల రోజుల్లోనే మార్పు కనిపించిందనీ , ముఖం మంచి వర్చస్సు ను సంతరించుకొందనీ , శరీరం తేలికగా ఉన్న భావన కలిగిందనీ , శాకాహారి గానే కొనసాగాలని ఫిక్స్ అయిపోయాననీ , నిరంతరం పనిచేస్తూ ఉండడమే తన సంతోషానికి కారణమనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 9 =