ఫ్యాన్ కు మాటిచ్చిన ఎన్టీఆర్

Jr NTR Shows Concern About The Health Condition Of His Die Hard Fan

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. హీరోలంటే అభిమానులకు ఎంత ప్రేమ ఉంటుందో.. తమ అభిమానులపై కూడా అదే ప్రేమను… అదే అభిమానాన్ని చూపిస్తారు మన హీరోలు. ఇక అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను స్వయంగా కలిసిన హీరోలు కూడా చాలా మంది వున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు తమ అభిమానుల లాస్ట్ విష్ ను తీర్చినవాళ్ళే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక ఫ్యాన్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతోపాటు మాటిచ్చాడు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకన్న అనే వ్యక్తి ఎన్టీఆర్‌ కు డైహార్డ్‌ ఫ్యాన్. వెంకన్న కొంతకాలంగా కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్టీఆర్ను‌ కలవాలని చాలా ఆశపడ్డాడు. ఇక వెంకన్న గురించి వివరాలు తెలుసుకున్న ఎన్టీఆర్‌ వీడియో కాల్‌లో వెంకన్న, ఆయన కుటుంబ సభ్యులతో సంభాషించారు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత కచ్చితంగా వెంకన్నను కలిసి సెల్ఫీ ఫొటో దిగుతానని ఎన్టీఆర్‌ మాటిచ్చాడు.
అన్నా.. మిమ్మల్ని చూడాలని, కలవాలని చాలా రోజుల కోరిక నాది. మీతో నాకొక సెల్ఫీ కావాలి. అంతకు మించి ఏం వద్దు… తప్పకుండా మనం కలిసి మంచి ఫొటో దిగుతాం. కరోనా పోయి, పరిస్థితులు కాస్త సర్దుకున్నాక. నిన్ను నేను ప్రత్యేకంగా కలుస్తాను. ఈలోపు నువ్వు బాగా తిని రెస్ట్‌ తీసుకో అని భరోసా ఇచ్చారు.

 

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా “రౌద్రం రణం రుధిరం ” లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అలియా భట్ , ఒలీవియా కథానాయికలు కాగా అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.