‘మిస్ ఇండియా’ రివ్యూ – మహిళా సాధికారితను తెలిపే సినిమా

Miss India Movie Review: A Movie That Speaks About The Importance Of Women Empowerment

నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మిస్ ఇండియా. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేష్ ‌ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయింది. పెంగ్విన్ తర్వాత ఓటీటీ లో రిలీజ్ అవుతున్న రెండో సినిమా ఇది. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ సక్సెస్ అందుకుందా..? లేదా? అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న‌టీన‌టులు : కీర్తిసురేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌వీన్‌చంద్ర‌, న‌దియా, న‌రేష్, క‌మ‌ల్ కామ‌రాజు, పూజిత పొన్నాడ‌, సుమంత్ శైలేంద్ర‌ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం : న‌రేంద్ర‌నాథ్‌
నిర్మాత‌ : మ‌హేష్ ఎస్. కోనేరు
సంగీతం: థమన్
సినిమాటోగ్ర‌ఫి : డానీ సంజెజ్ లోపెజ్‌, సుజిత్ వాసుదేవ్‌

క‌థ‌

మాన‌స సంయుక్త ( కీర్తి సురేష్‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి. చిన్నప్పటినుండి కెరీర్ గురించి.. మంచి స్థాయిలో ఉండాలని కలలు కంటుంది. అదే కలలతో పెరిగి పెద్దవుతుంది. ఆమెకు తాత‌య్య విశ్వ‌నాథ శాస్త్రి (రాజేంద్ర ప్ర‌సాద్‌) అంటే చాలా ఇష్టం. ఆయ‌నో ఆయుర్వేద వైద్యుడు. టీతోనే అన్ని రోగాల్నీ న‌యం చేస్తుంటాడు. ఆమె తన తాత చేసే ఆయుర్వేద టీ రెసిపీని ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ చేయాల‌ని కోరుకుంటుంది. ఇక పెద్దయ్యాక పరిస్థితులు మారతాయి. తాతయ్య చనిపోతాడు. తండ్రి (న‌రేష్‌)కి అల్జీమ‌ర్‌. ఇంటి భాద్యతలు అన్నయ్య కమల్ కామ రాజు పై పడుతుంది. దీనితో బిజినెస్ చేయడానికి ఇంట్లో వాళ్ల నుండే ఆమెకు సపోర్ట్ రాదు. ఈ క్రమంలో కమల్ కామ రాజుకు అమెరికాలో ఉద్యోగం వ‌స్తుంది. దాంతో.. కుటుంబం అంతా.. అమెరికా షిఫ్ట్ అవుతుంది. ఇక అక్కడే ఉండి ఏంబీఏ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరినా చిన్నప్పటి నుండి ఆమెకు బిజినెస్ చేయాలని కల ఉండటంతో ఉద్యోగం కూడా మానేసి బిజినెస్ చేయడానికి సిద్ధపడుతుంది. అక్క‌డ `మిస్ ఇండియా` పేరుతో టీ వ్యాపారం ప్రారంభిస్తుంది. అయితే అప్పటికే అక్క‌డ కాఫీ బిజినెస్‌ని ర‌న్ చేస్తున్న కైలాష్ ( జ‌గ‌ప‌తిబాబు) నుంచి పోటీని త‌ట్టుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. మరి అన్ని అడ్డంకులు ఎదుర్కొని
సంయుక్త ఎలా విజయం సాధించింది? అన్న‌ది `మిస్ ఇండియా` స్టోరీ.

విశ్లేషణ..

నిజానికి ఇలాంటి పాయింట్ మీద చాలా సినిమాలే వచ్చాయి. కానీ డైరెక్టర్ ఎంత కొత్తగా చూపించాడు.. ప్రేక్షకుడిని ఎంతవరకూ ఎంగేజ్ చేసాడు అన్నది మెయిన్ థింగ్. ఇక మ‌హిళా సాధికార‌త‌ని తెలియ‌జేస్తూ మంచి క‌థ‌నే ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు న‌రేంద్ర‌నాథ్. నిజానికి మహిళా ప్రాధాన్యత సినిమాలు అంటే మనకు కొన్ని పాయింట్స్ మైండ్ లోకి వచ్చేస్తాయి. లేడీ ఓరియంటెడ్ అంటే. హార‌ర్ సినిమానో.. ఆడ‌వారి క‌ష్టాల మీద అనో స్ట్రైక్ అయ్యాయి. కానీ.. ఇలా ఒక బిజినెస్ ప‌ర్స‌న్ గా ఎద‌గ‌డం చాలా త‌క్కువ సినిమాల్లో చూశాం. ఆ పాయింట్ తో కథను అల్లుకొని చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్.

మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆతర్వాత చాలా వరకూ మహిళా ప్రధాన పాత్రల్లోనే సినిమాలు చేస్తుంది. ఇక తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహానటి సావిత్రి లాంటి పాత్రనే అవలీలగా చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇలాంటి పాత్రలు చేయడం ఆమెకు చాలా ఈజీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లేడీ ప్రధానమైన సినిమా కాబట్టి సినిమా మొత్తం తన భుజాలపైనే మోసింది. కీర్తి సురేష్ ఎప్పటిలాగే త‌న దైనశైలిలో సంయుక్త పాత్రలో న‌టించింది. స్ట్రాంగ్ మ‌హిళ‌గా చక్క‌ని న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించింది. సీరియ‌స్‌తో పాటు కొన్ని స‌న్నివేశాల్లోనూ కీర్తి పండించిన కామెడీ ఆక‌ట్టుకుంది.

ఇక ప్రత్యర్థిగా నటించిన జగపతిబాబుకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. జ‌గ‌ప‌తిబాబు ఎప్ప‌టిలా స్టైలీష్ విల‌న్ పాత్ర‌లో మెప్పించాడు. కార్పొరేల్ బిజినెస్‌మెన్‌గా శైలేష్ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు త‌న‌దైన ముద్ర వేశారు. ఇక న‌వీన్ చంద్ర, న‌దియా, న‌రేష్, రాజేంద్ర‌ప్ర‌సాద్, పూజిత పొన్నాడ‌, దివ్యశ్రీపాద, కమల్ కామరాజు ముఖ్య పాత్రల్లో నటించారు. వారి పాత్రల మేర వారు నటించారు.

సాంకేతిక విభాగానికి వస్తే థమన్ అందించిన నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. నార్మల్ సీన్స్ కూడా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల బాగా ఎలివేట్ అయ్యాయి. డానీ సంజెజ్ లోపెజ్‌, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. త‌మ్మిరాజు ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫైన‌ల్ గా చెప్పాలంటే ఆడవాళ్లు ఏ విషయంలో తక్కువ కాదు… వాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనేదే `మిస్ ఇండియా` కథ. బిజినెస్ వార్ లాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eleven =