‘మిస్ ఇండియా’ – కెరీర్ కోసం కలలు కనే యువత చూడాల్సిన సినిమా

Mrs India Movie Is Dedicated To Every Aspiring Young Business Person

మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఇప్పుడు మరో మహిళా ప్రధానమైన సినిమాతో ముందుకు వస్తుంది. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్ ఇండియా’. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా రేపు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏం ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* నిజానికి ఈ సినిమాను టైటిల్ పేరు వింటే మిస్ ఇండియా గురించిన కథ అనుకుంటారు. కానీ ట్రయిలర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. టీ కి కాఫీ కి మధ్య పోటీ అని తెలుస్తుంది. ఇలాంటి కథతో సినిమా రావాడం కూడా ఇదే మొదటిసారి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కుతున్న సినిమాను చూడాల్సిందే.

* మరి ముఖ్యంగా ఈనాటి యువతకు కూడా ఒక మెసేజ్ లాంటి సినిమా ఇది. చిన్నప్పటి నుండే మంచి స్థాయిలో ఉండాలని కలలు కనే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఒక ఉదాహరణ. ఇంట్లో పెద్దగా సపోర్ట్ లేకపోయినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ కలలను ఎలా నెరవేర్చుకోవాలని ఈ సినిమాలో చూసి నేర్చుకోవచ్చు.

* విదేశాల్లో ఎక్కువగా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి ఓ దేశంలో మన దేశం నుండి వెళ్లిన ఓ అమ్మాయి టీ బిజినెస్‌ను స్టార్ట్‌ చేస్తుంది. బిజినెస్‌ రంగంలో రాణించాలని ఆ మధ్య తరగతి అమ్మాయి చాలా కలలు కంటుంది. టీ బిజినెస్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఆమెకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఆమె ఎలా అధిగమించి సక్సెస్‌ అయ్యిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

* మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. కీర్తి సురేష్ కు జగపతి బాబుకు మధ్య బిజినెస్ వార్. ఈ మధ్య కాలంలో విలన్ కు హీరో కు మధ్య పోటీలు ఛాలెంజ్ లు ఉండటం చూశాం. ఇప్పుడు మేల్ కి ఫిమేల్ కు మధ్య పోటీ అది కూడా బిజినెస్ వార్ అంటే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.

* తారాగణం.. కీర్తి సురేష్ తో పాటు జగపతిబాబు, నదియా, నరేష్, రాజేంద్రబాబు లాంటి పెద్ద తారాగణం ఈ సినిమాలో నటించడం. నదియా సామాన్య గృహిణిగా నరేష్ వైఫ్ గా నటించడం మరో ఇంట్రెస్టింగ్ థింగ్. జగపతిబాబు నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. ఇంకా నవీన్ చంద్ర, కమల్ కామ రాజు కూడా ప్రత్యేక పాత్రల్లో నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + nine =