హైదరాబాద్ లో “ఖిలాడి “

Ravi Teja Khiladi Movie Team Kickstarts shooting Work In Hyderabad

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “క్రాక్ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం. ఇప్పుడు రవితేజ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో రవితేజ డిసెంబర్ నెలాఖరు వరకూ “ఖిలాడి “మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =