క్యాచీ టైటిల్ తో నాగశౌర్య ?

Tollywood Actor Naga Shaurya Next Gets A Catchy Title

పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో నాగశౌర్య వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. వేరే బ్యానర్ మూవీస్ లో నటిస్తూనే నాగశౌర్య తన స్వంత బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో “కల్యాణ వైభోగమే ” మూవీ లో హీరోగా నటించిన నాగశౌర్య ఇప్పుడు మరో దర్శకురాలు సౌజన్య దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో రీతూ వర్మ కథానాయిక. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కి “వరుడు కావలెను ” టైటిల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. “వరుడు కావలెను ” టైటిల్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. 2021 సంవత్సరం వేసవికి రిలీజ్ కానుంది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “#NS20 ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దర్శకులు రమణ తేజ , అవసరాల శ్రీనివాస్ , అనీష్ కృష్ణ మూవీస్ కు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + thirteen =