ఏఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం వీఎఫ్ ఎక్స్ మరియు గ్రాఫిక్స్ ను ఉపయోగించనున్నట్టు తెలుస్తుంది. దానికి కారణం కరోనానే. అసలు సంగతేంటంటే.. జయలలిత రాజకీయ జీవితం కూడా చూపించనున్న నేపథ్యంలో పొలిటికల్ గా మీటింగ్ లు.. ర్యాలీలు ఉంటాయి. అయితే పరిస్థితులు నార్మల్ గా ఉంటే జనాల్ని పెట్టి చేసేవాళ్ళు. అయితే కరోనా కాబట్టి ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో పొలిటికల్ రిలేటెడ్ ఎపిసోడ్స్ కు వీఎఫ్ఎక్స్ ను ఉపయోగించనున్నారట.
కాగా ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: