అప్పుడు క్రష్ – ఇప్పుడు అమ్మ

Actress Bhagyashree Makes An Interesting Revelation About Rebel Star Prabhas

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ‘రాధే శ్యామ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదల చేసిన పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మోషన్ పోస్టర్ అయితే అదిరిపోయింది. మరో ప్రేమ కావ్యంలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఆ మోషన్ పోస్టర్ ను చూస్తే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి భాగ్య శ్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఒకఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. రాధే శ్యామ్ షూటింగ్ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.. సినిమా చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. సెట్ లో అందరూ మైనే ప్యార్ కియా సినిమా చూసారు.. ఒక్కప్పుడు తన క్రష్ అయినా ఇప్పుడు తనకు అమ్మగా నటిస్తున్నాని.. అలా చేయడం ఇదే మొదటిసారి అనుకుంటా అని చెప్పింది. నా షూటింగ్ లాస్ట్ డే హైద్రాబాదీ వంటకాలన్నిటిని రుచి చూపించాడు.. అంతేకాదు అన్ని రకాల స్వీట్స్ ను ప్యాక్ చేసి ఇచ్చాడని తెలిపింది.

కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =