కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 203

సినిమా వార్తలు

'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి బాలకృష్ణ సాయం

మరోసారి బాలకృష్ణ తన ఉదార స్వభావాన్ని చూపించారు.అది కూడా తమ కుటుంబంపై నెగిటివ్ గా ప్రచారం చేస్తూ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి. అసలు సంగతేంటంటే.. ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఎన్టీఆర్ పాత్రలో ‘విజ‌య్‌కుమార్’ అనే స్టేజ్ ఆర్టిస్ట్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈయ‌న భార్య‌కు ఇటీవ‌ల‌ క్యాన్స‌ర్ సోకింది. దాంతో విజ‌య్‌కుమార్ వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్నాడట.దీంతో బాలయ్య తన బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌ లో ‘విజ‌య్‌కుమార్’ భార్యకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారట.

TFN Adminవాట్సాప్
Senior Heroine Re Entries Turing As Lucky Charm for Star Heroes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Tollywood Senior Heroines Latest News,Telugu Film Industry Senior Heroines Re Entries
స్పెషల్

స్టార్ హీరోలకు ప్లస్ అవుతున్న సీనియర్ హీరోయిన్స్

ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్లు గా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు.. ఈ జనరేషన్ లో స్టార్ హీరోల పక్కన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఏదో పాత్ర దక్కింది చేస్తున్నాం అన్నట్టు కాకుండా.. దర్శకులు కూడా ఏదో వారిని తీసుకోవాలి.. పాత్ర ఇవ్వాలి అన్నట్టు కాకుండా.. సినిమాకే వాళ్ళు కీలక పాత్రలుగా చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే సినిమా నడిచే పాత్రలను సృష్టిస్తున్నారు. అలా ఆనాడే కాదు.. ఈ జనరేషన్ స్టార్ హీరోలకి... వారి సినిమాలకి క్రేజ్ తీసుకొస్తూ... ప్లస్ అవుతున్నారు.. ఆనాటి స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్స్.. మరి వారి ద్వారా క్రేజ్ వచ్చిన సినిమాలు ఏంటో…

TFN Adminవాట్సాప్
Aakaasam Nee Haddhu Ra Movie Teaser Out Now
ట్రైలర్ & టీజర్

'ఆకాశం నీ హద్దురా' టీజర్ రిలీజ్

సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు టీజర్ ను రానా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫేక్ పోస్ట్ లు పెడితే కేసు తప్పదు

సోషల్ మీడియా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందో తెలియదు కానీ.. సెలెబ్రిటీస్ కు మాత్రం సోషల్ మీడియా వల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువే అని చెప్పొచు. వాళ్ళు పొరపాటున ఏం చిన్న పని చేసినా అంతే.. కామెంట్స్ మీద కామెంట్స్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ సోషల్ మీడియాకు బలైన సెలబ్రిటీస్ ఎంతో మంది వున్నారు. కొందరు చూసి చూసి ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా..!

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి

2006 సంవత్సరంలో "ఫోటో" మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన అంజలి తరువాత కోలీవుడ్ లో బిజీగా మారారు. 2013 సంవత్సరంలో అంజలి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ కి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకొన్నారు. అంజలి హీరోయిన్ గా నటించిన బలుపు, గీతాంజలి మూవీస్ ఘనవిజయం సాధించాయి. కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న అంజలి తెలుగమ్మాయి కావడం విశేషం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'పింక్' రీమేక్ షూటింగ్ డేట్ కుదిరిందా..?

వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న సంగతి కూడా విదితమే. మరి ఇప్పటికీ కన్ఫ్యూజన్ వున్న ఈ సినిమా ప్రారంభంపై ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ నెల 20 నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. పవన్ కూడా త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారట. ఒకపక్క రాజకీయాల్లో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ ఈ సినిమా కోసం కొద్దిరోజులు మాత్రమే కేటాయించడంతో దర్శక నిర్మాతలు కూడా అందుకు…

TFN Adminవాట్సాప్
Allu Arjun Entertains Audience With A Different Look In AA20
సినిమా వార్తలు

AA 20 మూవీ లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో AA 20 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అల్లు అర్జున్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించనున్నారని సమాచారం. 20సంవత్సరాల క్రితం చిత్తూరి కి చెందిన యువకుడిగా, పెరిగిన గడ్డంతో, కాస్ట్యూమ్స్ పరంగా ఒక డిఫరెంట్ లుక్ లో అల్లు అర్జున్ కనిపిస్తారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రజినీకాంత్ 'దర్బార్' క్రేజ్ కంపెనీలకు సెలవు..!

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్‌, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి.. సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కోలీవుడ్ లో "దర్బార్" మూవీ ఫీవర్

ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం ఉన్న తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ మూవీ రిలీజ్ అనగానే అభిమానులు ఒక పండగలా జరుపుకొంటారు. సంక్రాంతి పండగ మరో సినిమా (దర్బార్ ) పండగతో కలసి వస్తుంది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "దర్బార్" మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో జనవరి 9వ తేదీ రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
Common Factor among 2020 Sankranthi Directors
సినిమా వార్తలు

2020 సంక్రాంతి డైరెక్ట‌ర్స్.. ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్

2020 సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ (ద‌ర్బార్, స‌రిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ‌పుర‌ములో, ఎంత మంచివాడ‌వురా) సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ నాలుగు సినిమాల ద‌ర్శ‌కుల‌కు కూడా ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే ఆ యా ద‌ర్శ‌కుల‌కు ఆ యా చిత్రాలు సెకండ్ పొంగ‌ల్ రిలీజెస్ కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏయ‌న్నార్ `న‌మ్మిన బంటు`కి 60 వ‌సంతాలు

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, మ‌హాన‌టి సావిత్రి, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు కాంబినేష‌న్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో `న‌మ్మిన బంటు` ఒక‌టి. గ్రామీణ నేప‌థ్యంలో రూపొందిన ఈ కుటుంబ క‌థా చిత్రంలో య‌స్వీ రంగారావు, గుమ్మ‌డి, రేలంగి, గిరిజ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమిక‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ‘అన్న‌య్య’కు 20 ఏళ్ళు

అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ప‌లు చిత్రాలు తెలుగు య‌వ‌నిక‌పై చెర‌గ‌ని ముద్ర‌ను వేశాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘అన్న‌య్య’ ఒక‌టి. తమ్ముళ్ళు ఏం చేసినా వారిని వెనకేసుకుని రావడమే కాకుండా... “నా త‌మ్ముళ్ళు జ‌మ్స్” అంటూ చిరు చేసిన సందడికి అప్ప‌ట్లో ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ‘చూడాల‌ని వుంది!’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత చిరు, సౌంద‌ర్య జంటగా నటించిన ఈ సినిమాలో ర‌వితేజ‌, వెంక‌ట్, చాందిని, శిష్వా, కోట శ్రీ‌నివాస‌రావు, శ‌ర‌త్‌బాబు, భుపేంద‌ర్ సింగ్, ఉత్తేజ్, ప్రియ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలు పోషించగా... సిమ్రాన్ ఐట‌మ్ సాంగ్‌లో న‌ర్తించింది. చిరు క‌మ్ బ్యాక్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌ండ‌గ‌ల‌నే టార్గెట్ చేసుకున్న ర‌ష్మిక చిత్రాలు

`ఛ‌లో`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌న్న‌డ కోమ‌లి ర‌ష్మికా మంద‌న్న‌... ఆపై `గీత గోవిందం`తో స్టార్ డ‌మ్ చూసింది. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ న‌టించిన కొత్త చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. విశేష‌మేమిటంటే... ఆయా చిత్రాలు ఫెస్టివ‌ల్ సీజ‌న్స్ లోనే తెర‌పైకి రాబోతున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆంగ్ల శీర్షిక‌ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సంద‌డి

అన‌తికాలంలోనే యూత్ ఐకాన్ గా ఎదిగిన వైనం యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సొంతం. వ‌రుస విజ‌యాల‌తో, అవకాశాల‌తో.. సినీవినీలాకాశంలో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు ఈ యువ సంచ‌ల‌నం.

Team TFNవాట్సాప్
96 Telugu Movie Title And First Look Out
ఫస్ట్ లుక్

'96' రీమేక్ శర్వానంద్ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్, నాగచైతన్య లకు జోడీ గా నటించాలని ఉంది _ రష్మిక

బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం " మూవీ ఘనవిజయంతో స్టార్ డమ్ పొందారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో రష్మిక బిజీగా మారారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో రష్మిక జంటగా నటించిన "సరిలేరు నీకెవ్వరు మూవీ జనవరి 11వ తేదీ రిలీజ్ కానుంది. యంగ్ హీరో నితిన్ కు జోడీ గా నటించిన "భీష్మ " మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో రష్మిక జతకట్టిన "AA 20" మూవీ సెట్స్ పై ఉంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ప‌ట్టాస్' ట్రైలర్ రిలీజ్

ఎప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి రెడీగా వుండే నటుల్లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం ధ‌నుష్ హీరోగా ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `ప‌ట్టాస్` పేరుతో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరిన్ని తెలుగు మూవీస్ లో నటిస్తాను - టబు

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల .. వైకుంఠపురములో ... " మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. చాలా కాలం గ్యాప్ తరువాత సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించారు. సుశాంత్, నవదీప్, నివేత పేతురాజ్ , రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Interview About Sarileru Neekevvaru,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie News,Actress Rashmika Mandanna Latest Updates,Her
సినిమా వార్తలు

నేను మంచి కాపీ క్యాట్ ని

ఛలో', 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మిక మందన్నా. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్‌ రష్మిక మందన్నా ఇంటర్వ్యూ.

TFN Adminవాట్సాప్
Ala Vaikunthapurramuloo Latest Trailer, Ala Vaikunthapurramuloo Movie Trailer Out Now, Ala Vaikunthapurramuloo Movie Updates, Ala Vaikunthapurramuloo New Trailer, Ala Vaikunthapurramuloo Officail Trailer, Ala Vaikunthapurramuloo Telugu Movie Latest N
ట్రైలర్ & టీజర్

'అల వైకుంఠపురములో' ట్రైలర్ రిలీజ్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతూ సూపర్ హిట్ అయ్యాయి. దీనితో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్