మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో AA 20 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అల్లు అర్జున్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించనున్నారని సమాచారం. 20సంవత్సరాల క్రితం చిత్తూరి కి చెందిన యువకుడిగా, పెరిగిన గడ్డంతో, కాస్ట్యూమ్స్ పరంగా ఒక డిఫరెంట్ లుక్ లో అల్లు అర్జున్ కనిపిస్తారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన “ఆర్య”, “ఆర్య 2” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందనున్న AA 20 మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. బ్లాక్ బస్టర్ “రంగస్థలం” మూవీ తరువాత దర్శకుడు సుకుమార్ ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ “జులాయి”, “S/0 సత్యమూర్తి” తరువాత హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: