‘ప‌ట్టాస్’ ట్రైలర్ రిలీజ్

Pattas Movie Trailer Out Now

ఎప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి రెడీగా వుండే నటుల్లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం ధ‌నుష్ హీరోగా ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `ప‌ట్టాస్` పేరుతో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. తండ్రి ధనుష్ సరసన స్నేహ నటించగా, మెహ్రీన్ పిర్జాడా కొడుకు ధనుష్ కు జోడీగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. జ‌న‌వ‌రి 16న త‌మిళ‌నాట ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో `రుస్తుం` పేరుతో అనువ‌దించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nineteen =