రజినీకాంత్ ‘దర్బార్’ క్రేజ్ కంపెనీలకు సెలవు..!

Rajinikanth Darbar Movie Craze,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Darbar Movie Updates,Darbar Telugu Movie Latest News,Darbar – Rajinikanth Craze Hits A High Note,Superstar Rajinikanth Darbar Movie Live Updates

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్‌, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి.. సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఫ్యాన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఆయన సినిమాలంటే తమిళనాట పండగ వాతావరణం నెలకొంటుంది. దీనిలోభాగంగానే కొన్ని కంపెనీలు అయితే ఏకంగా రజినీ సినిమా చూడండి అంటూ సెలవు ప్రకటించేస్తాయి. గతంలో వచ్చిన రజిని పేట సినిమాకు కొన్ని ప్రైవేట్ కంపెనీలు సెలవు ప్రకటించడమే కాకుండా సినిమా టికెట్ ను కూడా ఇచ్చింది. ఇప్పుడేమో ఓ కంపెనీ ఉద్యోగులకు సెలవు ఇవ్వడమే కాదు ఆరోజుకు జీతం ఇవ్వడంతో పాటుగా ఆసినిమా టికెట్లను కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. 2లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జనవరి 9న విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 8 =