కోలీవుడ్ లో “దర్బార్” మూవీ ఫీవర్

Darbar Movie Fever Soars In Kollywood

ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం ఉన్న తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ మూవీ రిలీజ్ అనగానే అభిమానులు ఒక పండగలా జరుపుకొంటారు. సంక్రాంతి పండగ మరో సినిమా (దర్బార్ ) పండగతో కలసి వస్తుంది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “దర్బార్” మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో జనవరి 9వ తేదీ రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“దర్బార్” మూవీ రిలీజ్ సందర్భంగా కోలీవుడ్ లో ఆ మూవీ ఫీవర్ మొదలయింది. గతంలో రజనీకాంత్ నటించిన “పేట” మూవీ విడుదల సందర్భంగా చెన్నై లో కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించి ఉద్యోగులకు మూవీ టికెట్స్ పంచాయి. ఇప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు హాలిడే ప్రకటిస్తూ, మూవీ టికెట్స్ పంచడంతో ఆ సంస్థల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేలం లోని రజనీకాంత్ అభిమానులు “దర్బార్” మూవీ ప్రదర్శించే థియేటర్స్ పై హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించడానికి పోలీసుల అనుమతి కోరుతున్నారని , చెన్నై లోని తలైవా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేయనున్నారని సమాచారం .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =