2006 సంవత్సరంలో “ఫోటో” మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన అంజలి తరువాత కోలీవుడ్ లో బిజీగా మారారు. 2013 సంవత్సరంలో అంజలి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ కి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకొన్నారు. అంజలి హీరోయిన్ గా నటించిన బలుపు, గీతాంజలి మూవీస్ ఘనవిజయం సాధించాయి. కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న అంజలి తెలుగమ్మాయి కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మూవీ మొదటి రోజు షూటింగ్ లో సీనియర్ ఆర్టిస్ట్స్ వెంకటేష్, ప్రకాష్ రాజ్, జయసుధ కాంబినేషన్ లో నటించాల్సి వచ్చిందని, ముగ్గురు సీనియర్స్ కావడంతో భయం వేసిందని, వెంకటేష్, ప్రకాష్ రాజ్ తనలో భయాన్ని పోగొట్టారని, నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గొనడంతో ఆ మూవీ లోని సీత క్యారెక్టర్ లో ఈజీ గా నటించానని గత అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించానని, బలమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తానని, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాని, 10 సంవత్సరాల పాటు గుర్తుండే సరైన పాత్రలో నటిస్తే చాలనుకుంటానని, కన్నడ , మలయాళం తో కలుపుకొని 46 మూవీస్ లో నటించానని అంజలి తెలిపారు. అంజలి నటించిన “నిశ్శబ్దం మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అంజలి నటిస్తున్న 4తమిళ , 3 తెలుగు మూవీస్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: