2020 సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ (దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా) సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ నాలుగు సినిమాల దర్శకులకు కూడా ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే ఆ యా దర్శకులకు ఆ యా చిత్రాలు సెకండ్ పొంగల్ రిలీజెస్ కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తన తొలి చిత్రం `దీన` (తమిళ్) తరువాత పాన్ – ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ నుంచి వస్తున్న పొంగల్ మూవీ `దర్బార్` కాగా.. `ఎఫ్ 2` అనంతరం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సంక్రాంతి సినిమా `సరిలేరు నీకెవ్వరు`. ఇక `అజ్ఞాతవాసి` తరువాత ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ నుంచి వస్తున్న పొంగల్ మూవీ `అల వైకుంఠపురములో` కాగా.. `శతమానం భవతి` అనంతరం టాలెంటెడ్ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న నుంచి సంక్రాంతి సినిమా `ఎంత మంచివాడవురా`. ఓవరాల్ గా… ఫస్ట్ పొంగల్ రిలీజెస్ లో ఒక్క త్రివిక్రమ్ మినహా అందరూ ఘనవిజయాలు చూసినవారే కావడం విశేషం.
మరి.. సెకండ్ పొంగల్ రిలీజెస్ పరంగా ఈ నలుగురు టాలెంటెడ్ డైరెక్టర్స్ కూడా బ్లాక్ బస్టర్స్ అందుకుంటారేమో చూడాలి.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























