’96’ రీమేక్ శర్వానంద్ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

96 Telugu Movie Title And First Look Out

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ’96’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తాజాగా చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను అండ్ టైటిల్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘జాను’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. నాలుగు ఒంటెలకు ఎదురుగా.. ఎడారిలో శర్వానంద్ కెమెరా పట్టుకొని కనిపిస్తున్నాడు. పోస్టర్ చూడటానికి చాలా డిఫరెంట్ గా, ఇంట్రస్టింగ్ గా ఉంది. కానీ, సమంత లుక్ మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు చిత్రయూనిట్. ఆమె లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

కాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. మరి తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష ఈ సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. ఇక శర్వానంద్, సమంత మొదటిసారి జోడీ కడుతున్న ఈ మూవీ రిలీజ్ పై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 4 =