
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 188


"టక్ జగదీష్" మూవీ షూటింగ్ ప్రారంభం

`అశ్వథ్థామ` సెన్సార్, రన్ టైమ్ డిటైల్స్
మరోసారి రవితేజ ద్విపాత్రాభినయం?
`పింక్` రీమేక్ లో ఆకాంక్ష సింగ్?
నానితో మరోసారి మారుతి
మరోసారి బాలకృష్ణ, అంజలి జోడీ?

"జాతి రత్నాలు"మూవీ లో కీర్తి సురేష్ గెస్ట్ రోల్
ఉగాది రోజు పచ్చడి పచ్చడే - నాని
పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ మూవీ ప్రారంభం

"జాను" మూవీ ట్రైలర్ రిలీజ్

ఐ యామ్ ఆల్ రైట్ - రజనీకాంత్

ఏడు కోణాల్లో సాగే పాత్రలో నాగశౌర్య

శర్వానంద్ తో కిషోర్ తిరుమల చిత్రం?

కార్తికి జోడీగా త్రిష

`ఆర్ ఆర్ ఆర్`లో శ్రియ

"వలయం"మూవీ లోని "నిన్ను చూశాకే"సాంగ్ విడుదల
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ, దిగాంగన జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "వలయం"మూవీ ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. పద్మావతి చదలవాడ నిర్మాత.

"టక్ జగదీష్" మూవీ షూటింగ్ ప్రారంభం
సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణ సారథ్యంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడు గా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందిన "నిన్నుకోరి" మూవీ ఘనవిజయం సాధించింది.

`అశ్వథ్థామ` సెన్సార్, రన్ టైమ్ డిటైల్స్
యువ కథానాయకుడు నాగశౌర్య తనే కథను అందించి మరీ నటించిన చిత్రం `అశ్వథ్థామ`. నూతన దర్శకుడు రమణ తేజ రూపొందించిన ఈ సినిమాలో నాగశౌర్యకి జోడీగా స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ నటించగా.. శౌర్య హోమ్ బేనర్ ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. శ్రీచరణ్ పాకాల బాణీలు అందించగా.. జిబ్రాన్ నేపథ్య సంగీతమందించాడు.
మరోసారి రవితేజ ద్విపాత్రాభినయం?
మాస్ మహారాజా రవితేజ మరోమారు రెండు విభిన్న పాత్రల్లో పలకరించనున్నారు. ఇప్పటికే `విక్రమార్కుడు`, `దరువు`, `కిక్ 2`, `డిస్కో రాజా` చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఈ టాలెంటెడ్ స్టార్.. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో డబుల్ ధమాకా ఇవ్వనున్నారట.
`పింక్` రీమేక్ లో ఆకాంక్ష సింగ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ బాట పట్టిన సంగతి తెలిసిందే. `పింక్` రీమేక్ గా తెరకెక్కుతున్న పవన్ కమ్ బ్యాక్ ప్రాజెక్ట్ ని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ రూపొందిస్తున్నాడు. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అనన్య ముఖ్య భూమికల్లో నటిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.

"ఇచ్చట వాహనములు నిలుప రాదు" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సక్సెస్ ఫుల్ "చి || ల || సౌ " మూవీ తరువాత బ్రేక్ తీసుకొన్న హీరో సుశాంత్ , బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ లో ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సుశాంత్ హీరోగా ఒక కొత్త మూవీ హైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభం కానుంది. మీనాక్షి చౌదరి కథానాయిక కాగా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
నానితో మరోసారి మారుతి
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `భలే భలే మగాడివోయ్` (2015) ఒకటి. యూత్ ఫుల్ సినిమాల స్పెషలిస్ట్ మారుతి రూపొందించిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్.. అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. ఇంతటి ఘనవిజయం సాధించిన ఆ చిత్రం తరువాత నాని, మారుతి మళ్ళీ జట్టుకట్టనేలేదు. అయితే, త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరనుందని సమాచారం.
మరోసారి బాలకృష్ణ, అంజలి జోడీ?
నటసింహ బాలకృష్ణ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో తెలుగమ్మాయి అంజలి ఒకరు. నాలుగేళ్ళ క్రితం విడుదలైన `డిక్టేటర్`(2016)లో బాలయ్య, అంజలి జంట మురిపించింది. కట్ చేస్తే... సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఇద్దరూ మరోమారు జట్టుకట్టనున్నారని టాలీవుడ్ టాక్.

"జాతి రత్నాలు"మూవీ లో కీర్తి సురేష్ గెస్ట్ రోల్
స్వప్న సినిమాస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణసారథ్యంలో అనుదీప్ కె.వి దర్శకత్వంలో సూపర్ హిట్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ "జాతి రత్నాలు" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రధాన్ సంగీతం అందించారు.

సినిమా పాటకు చిరునామా వేటూరి ..జయంతి నేడు
గీత రచయితగా ఆయన ప్రస్థానం 70వ దశకం ప్రథమార్థంలో ప్రారంభమైనప్పటికీ ద్వితీయార్థం చివరిలోనే ఆయన ప్రభ ప్రారంభమైంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన అడవి రాముడు చిత్రంలోని "కృషివుంటే మనుషులు రుషులవుతారు" పాటలోని అర్ధ పరమార్ధంలకు అద్దం పట్టినట్లుగానే కృషితో ఋషిగా ఎదిగి తెలుగు సినిమా పాటకు చిరునామా అయ్యారు వేటూరి సుందరరామ్మూర్తి.
ఉగాది రోజు పచ్చడి పచ్చడే - నాని
ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరోలు నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కానుకగా మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు కాగా జగపతి బాబు, నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.
పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ మూవీ ప్రారంభం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరొక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ రూపొందనుంది.

"జాను" మూవీ ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా "జాను" మూవీ ఫిబ్రవరి 7 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ సూపర్ హిట్ "96 " మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన "జాను" మూవీ కి గోవింద్ వసంత సంగీతం అందించారు. సక్సెస్ కు మారుపేరైన మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించారు.

"శభాష్ మిథు" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సక్సెస్ ఫుల్ మూవీ "ఝుమ్మందినాదం" తో టాలీవుడ్ లో ప్రవేశించిన తాప్సీ పన్ను తమిళ, మలయాళ భాషాచిత్రాలలో కూడా నటించారు. సూపర్ హిట్ "చష్మే బద్దూర్ " మూవీ తో తాప్సీ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటిస్తున్నా తాప్సీ బాలీవుడ్ మూవీస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మహిళా ప్రాధాన్యత కల చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఒక మహిళా క్రికెటర్ బయోపిక్ మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.

బాలీవుడ్ మూవీ "అంధాధున్" తమిళ రీమేక్ లో రమ్యకృష్ణ ?
శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలలో హిందీలో రూపొందిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ "అంధాధున్" మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. 32 కోట్లతో రూపొందిన ఈ మూవీ 456 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 3 నేషనల్ అవార్డ్స్, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ లో టబు తన పాత్ర లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

ఐ యామ్ ఆల్ రైట్ - రజనీకాంత్
డిస్కవరీ ఛానెల్ లో ప్రసారమయ్యే "మ్యాన్ వర్సెస్ వైల్డ్" ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలిసిందే. బ్రిటిష్ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ ఈ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం బేర్ గ్రిల్స్ ప్రధాని మోదీ తో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ఒక ఎపిసోడ్ రూపొందించారు. ప్రధాని మోదీ తరువాత ఇండియన్ సెలబ్రిటీ రజనీకాంత్ "మ్యాన్ వర్సెస్ వైల్డ్" ప్రోగ్రామ్ లో పాల్గొనడం విశేషం.

ఏడు కోణాల్లో సాగే పాత్రలో నాగశౌర్య
ప్రేమకథలకు చిరునామాగా నిలచిన యువ కథానాయకుల్లో నాగశౌర్య ఒకరు. `ఊహలు గుసగుసలాడే`, `కళ్యాణ వైభోగమే`, `ఒక మనసు`, `జ్యో అచ్యుతానంద`, `ఛలో`.. ఇలా విభిన్న కోణాల్లో సాగే పలు ప్రేమకథల్లో అలరించాడు శౌర్య. కట్ చేస్తే... ఇప్పుడు ఒకే చిత్రంలో ఏడు కోణాల్లో సాగే విభిన్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు శౌర్య.

శర్వానంద్ తో కిషోర్ తిరుమల చిత్రం?
`నేను శైలజ`తో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు కిషోర్ తిరుమల. ఆపై `ఉన్నది ఒక్కటే జిందగీ`, `చిత్రలహరి`తో అలరించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ప్రస్తుతం తన లక్కీ హీరో రామ్ తో మూడో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. తమిళ చిత్రం `తడమ్`కి రీమేక్ గా రూపొందుతున్న ఆ సినిమానే `రెడ్`. ప్రస్తుతం ఈ చిత్రం.. చిత్రీకరణ దశలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కార్తికి జోడీగా త్రిష
దాదాపు 17 ఏళ్ళుగా కథానాయికగా రాణిస్తోంది చెన్నై బ్యూటీ త్రిష. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన పాత్రల్లో దర్శనమిస్తూ తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్న ఈ అందాల అభినేత్రి.. ఇటీవల `96`తో మరోమారు మైమరిపించింది.

`ఆర్ ఆర్ ఆర్`లో శ్రియ
ఒక దశలో అగ్ర కథానాయికగా వెలుగొందిన టాలెంటెడ్ బ్యూటీ శ్రియ.. పెళ్ళయ్యాక కాస్త జోరు తగ్గించింది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆ మధ్య `యన్టీఆర్ కథానాయకుడు` వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం అతిథిగా మెరిసిన ఈ ఢిల్లీ సొగసరి.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.