నానితో మ‌రోసారి మారుతి

Director Maruthi To Team Up With Nani Once Again

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` (2015) ఒక‌టి. యూత్ ఫుల్ సినిమాల స్పెష‌లిస్ట్ మారుతి రూపొందించిన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్.. అప్ప‌ట్లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన ఆ చిత్రం త‌రువాత నాని, మారుతి మ‌ళ్ళీ జ‌ట్టుక‌ట్ట‌నేలేదు. అయితే, త్వ‌ర‌లోనే ఆ ముచ్చ‌ట కూడా తీర‌నుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

రీసెంట్ గా `ప్ర‌తి రోజూ పండ‌గే`తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన మారుతి… త‌న త‌దుప‌రి చిత్రంగా ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులోనే నాని క‌థానాయ‌కుడిగా న‌టించ‌బోతున్నాడు. కాగా, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

[custom_ad]

ఇదిలా ఉంటే.. నాని తాజా చిత్రం `వి` మార్చి 25న విడుద‌ల కానుంది. మ‌రోవైపు `ట‌క్ జ‌గ‌దీష్` నిర్మాణ ద‌శ‌లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + sixteen =