ప్రేమకథలకు చిరునామాగా నిలచిన యువ కథానాయకుల్లో నాగశౌర్య ఒకరు. `ఊహలు గుసగుసలాడే`, `కళ్యాణ వైభోగమే`, `ఒక మనసు`, `జ్యో అచ్యుతానంద`, `ఛలో`.. ఇలా విభిన్న కోణాల్లో సాగే పలు ప్రేమకథల్లో అలరించాడు శౌర్య. కట్ చేస్తే… ఇప్పుడు ఒకే చిత్రంలో ఏడు కోణాల్లో సాగే విభిన్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు శౌర్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే… `ఊహలు గుసగుసలాడే`, `జ్యో అచ్యుతానంద` తరువాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో శౌర్యది ఏడు కోణాల్లో సాగే డిఫరెంట్ రోల్ అని సమాచారం. మరి.. కొత్త తరహాలో సాగనున్న ఈ పాత్రతో నాగశౌర్యకి నటుడిగా ఎలాంటి గుర్తింపు దక్కుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. నాగశౌర్య తాజా చిత్రం `అశ్వథ్థామ` ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























