`అశ్వ‌థ్థామ‌` సెన్సార్, ర‌న్ టైమ్ డిటైల్స్

Aswathama Movie Censor And Run Time Details Is Out

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య త‌నే క‌థ‌ను అందించి మ‌రీ న‌టించిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ రూపొందించిన ఈ సినిమాలో నాగ‌శౌర్యకి జోడీగా స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ‌రీన్ న‌టించ‌గా.. శౌర్య హోమ్ బేన‌ర్ ఐరా క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల బాణీలు అందించ‌గా.. జిబ్రాన్ నేప‌థ్య సంగీత‌మందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. కాగా, 133 నిమిషాలు (2 గంట‌ల 13 నిమిషాలు) నిడివితో ఈ సినిమా జ‌నం ముందుకు రానుంది. మ‌రి… క్రిస్పీ ర‌న్ టైమ్ తో వ‌స్తున్న `అశ్వథ్థామ‌` బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

[custom_ad]

అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌పై పోరాడే యువ‌కుడి క‌థ‌తో రూపొందిన `అశ్వ‌థ్థామ‌` రేపు (జ‌న‌వ‌రి 31) థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.