`ఆర్ ఆర్ ఆర్`లో శ్రియ‌

Shriya Saran To Play A Pivotal Role In Rajamouli RRR?

ఒక ద‌శ‌లో అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందిన టాలెంటెడ్ బ్యూటీ శ్రియ‌.. పెళ్ళ‌య్యాక కాస్త జోరు త‌గ్గించింది. ఒక‌వైపు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. మ‌రోవైపు ఆచితూచి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఆ మ‌ధ్య `య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు` వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం కోసం అతిథిగా మెరిసిన ఈ ఢిల్లీ సొగ‌స‌రి.. తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్ య‌స్.య‌స్. రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` పేరుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, దేవ‌గ‌ణ్ కి జోడీగా శ్రియ న‌టిస్తోంద‌ని స‌మాచారం. అంతేకాదు.. వికారాబాద్ అడ‌వుల్లో జ‌రుగుతున్న షూటింగ్ లో అజ‌య్ దేవ‌గ‌ణ్ తో పాటు శ్రియ కూడా పాల్గొంటోంద‌ట‌. మ‌రి.. `ఛ‌త్ర‌ప‌తి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో.. `దృశ్యం` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత అజ‌య్ దేవ‌గ‌ణ్ తోనూ ప‌నిచేస్తున్న శ్రియ‌కి.. `ఆర్ ఆర్ ఆర్` ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.