బాలీవుడ్ మూవీ “అంధాధున్” తమిళ రీమేక్ లో రమ్యకృష్ణ ?

Ramya Krishnan To Act In A Remake Film

శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలలో హిందీలో రూపొందిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “అంధాధున్” మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. 32 కోట్లతో రూపొందిన ఈ మూవీ 456 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 3 నేషనల్ అవార్డ్స్, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ లో టబు తన పాత్ర లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇప్పుడు “అంధాధున్”హిందీ మూవీ తమిళ భాషలో రీమేక్ కానుంది. నటుడు, నిర్మాత, దర్శకుడు త్యాగరాజన్ నిర్మాణ సారథ్యం లో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రశాంత్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. “అంధాధున్”హిందీ మూవీలో టబు నటించిన క్యారెక్టర్ కు తమిళ రీమేక్ లో రమ్యకృష్ణ యాప్ట్ అని చిత్రయూనిట్ భావిస్తుంది. ఈ మూవీ కి రమ్య కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. హిందీ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన “అంధాధున్” మూవీ తమిళంలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.