పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ మూవీ ప్రారంభం

Pawan Kalyan - Director Krish New Movie Shooting Begins

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ “పింక్” తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరొక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా PSPK 27 మూవీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయింది. నిర్మాత ఆఫీస్ లో పూజా కార్యక్రమం జరుపుకున్నPSPK 27 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4వ తేదీ జరుగనుంది. కథానాయికలుగా పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ పేర్లు పరిశీలన లో ఉన్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న PSPK 27 మూవీ కై హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో పలు సెట్స్ రూపొందించారని, షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ అంతా ఆ సెట్స్ లోనే జరగనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =