కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 181

Nithiin To Play Chess Player In His Upcoming Movie
సినిమా వార్తలు

`చెక్` అంటున్న నితిన్?

ఒక‌వైపు `భీష్మ‌`, `రంగ్ దే` వంటి రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్స్ లో న‌టిస్తూనే.. మ‌రోవైపు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు యువ క‌థానాయ‌కుడు నితిన్. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇప్ప‌టికే స‌గానికిపైగా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది.

Team TFNవాట్సాప్
Naga Chaitanya To Play His Grandfather Nageswara Rao
సినిమా వార్తలు

`నాగేశ్వ‌ర రావు`గా నాగ‌చైత‌న్య‌?

ఆ మ‌ధ్య `మ‌నం`లో తండ్రి నాగార్జున పేరుని స్క్రీన్ నేమ్ చేసుకుని విజ‌యం అందుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. ఇటీవ‌ల `మ‌హాన‌టి`లో ఏకంగా తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర రావు పాత్ర‌లో ఒదిగిపోయి మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. క‌ట్ చేస్తే.. మ‌రోసారి తాత `నాగేశ్వ‌ర రావు` పేరుని స్క్రీన్ నేమ్ చేసుకుని చైతూ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అంతేకాదు.. టైటిల్ కూడా `నాగేశ్వ‌ర రావు`గానే ఉంటుంద‌ట‌.

Team TFNవాట్సాప్
These 5 Telugu Movies To Release On Valentines Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Telugu Movies Releasing This Week,Movies Released In This Week,Tollywood Movies Releasing This Week,World Famo
స్పెషల్

ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానున్న 5చిత్రాలు

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ "వరల్డ్ ఫేమస్ లవర్", క్రేజీ హీరో ధనుష్ "లోకల్ బాయ్" మూవీస్ తో పాటు కొత్త నటీనటులతో రూపొందిన "శివ 143", "లైఫ్ అనుభవించురాజా", "ఒక చిన్న విరామం" మూవీస్ ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రయోగాత్మకంగా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందిన "హుషారు", "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ", "మత్తు వదలరా" వంటి మూవీస్ ఘనవిజయం సాధించడంతో పలు మూవీస్ కొత్త కాన్సెప్ట్స్ తో టాలీవుడ్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

Team TFNవాట్సాప్
NBK 106 - Regular Shooting Begins From February 26
షూటింగ్ అప్‌డేట్

ఈ నెల 26 నుంచి `య‌న్.బి.కె 106` రెగ్యుల‌ర్ షూటింగ్

న‌ట‌సింహ బాల‌కృష్ణ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న `య‌న్.బి.కె. 106` ఎట్ట‌కేల‌కు సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. బాల‌య్య ల‌క్కీ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ డివోష‌నల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్.. ఈ నెల 26 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుందట‌. వార‌ణాసి నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుండ‌గా.. ఒక పాత్ర కోసం అఘోరాగా క‌నిపిస్తాడ‌ని టాక్. ఇక ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో శ్రియ‌, న‌య‌న‌తార ఆ పాత్ర‌ల్లో న‌టిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
Director Koratala Siva Teams Up With Mahesh Babu Once Again
సినిమా వార్తలు

మ‌హేష్ తో మ‌రోమారు కొర‌టాల‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఒక‌రు. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `శ్రీ‌మంతుడు` (2015), `భ‌ర‌త్ అనే నేను` (2018) బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. క‌ట్ చేస్తే... వీరి కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌రో సినిమా రాబోతోంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. ప్ర‌స్తుతం ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అదే ఏడాది చివ‌ర‌లో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే మ‌హేష్, కొర‌టాల థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
'వలయం' ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

'వలయం' ట్రైలర్ రిలీజ్

రమేశ్‌ కడుముల దర్శకత్వంలో లక్ష్‌, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'వలయం'. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్కప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తా..!

మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' తో సాయితేజ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సాయి తేజ్. ప్రస్తుతం సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతుంది. `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించ‌నున్నారు. ఇక ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, PVP, PVP acquires Bangalore Days remake rights, PVP Buys Another Tamil Movie Remake Rights, PVP Cinema acquires remake rights for Bangalore Days, PVP cinemas buys Baadshah Tamil rights, PVP Ventures set to spread its wings,
సినిమా వార్తలు

పీవీపీ చేతిలో మరో తమిళ్ రీమేక్

గత ఏడాది తమిళ్ లో వచ్చిన ఓ మై క‌దువ‌లే ( తెలుగులో ఓ నా దేవుడా) అనే రొమాంటిక్ కామెడీ సినిమా మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూత‌న ద‌ర్శ‌కుడు అశ్వ‌త్ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఇందులో అశోక్ సెల్వ‌న్‌, రితికా సింగ్‌, వాణి భోజ‌న్ ప్రధాన పాత్రల్లో నటించగా... ష‌రా, ఎంఎస్ భాస్క‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్` ఫస్ట్ లుక్ రిలీజ్

అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు ఈ సినిమాకు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'లోకల్ బోయ్' ట్రైలర్ రిలీజ్

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ఈ ఏడాది మొదట తూట అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ వెంటనే 'పటాస్' తో వచ్చాడు. ధనుష్ ద్విపాత్రాభినయంలో.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఈనెల 15వ తేదీన విడుదలై ఈ సూపర్ హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది. ఇక ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'లోకల్ బాయ్' అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మరి తమిళ్ లో హిట్ అయిన సినిమా తెలుగులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 - ఫైనల్లీ నా షూట్ స్టార్ట్..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Movie,Sarileru Neekevvaru,Sarileru Neekevvaru Telugu Movie,Sarileru Neekevvaru Team Celebrate 50 Days,Mahesh Babu,Mahesh Babu Sarileru Neekevvaru Movie,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood M
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు" మూవీ 50 రోజుల వేడుక ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షక, అభిమానులను ఉర్రూతలూగించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ రీమేక్ లో అఖిల్ ?

గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కరణ్ నిర్మాతగా షారుఖ్ - అట్లీ మూవీ

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అట్లీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ప్రెషర్ కుక్కర్' ట్రైలర్ రిలీజ్

పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచే. అలా మనదేశం కాకుండా పొరుగు దేశం అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. అక్కడికి వెళ్లాలని.. వెళ్లి బాగా సంపాదించాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఈ పరిస్థితి కాస్త తక్కువగా వున్నా... ఇప్పుడు మాత్రం కొంతమంది పేరెంట్స్ చిన్నప్పటినుండే తమ పిల్లలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే పాయింట్ తో ఓ సినిమా వస్తుంది. అదే ‘ప్రెషర్ కుక్కర్’.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"ఒరేయ్ బుజ్జిగా .. " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

సూపర్ హిట్ మూవీస్ "గుండెజారి గల్లంతయ్యిందే", "ఒక లైలా కోసం" మూవీ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా .. " మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెగటివ్ రోల్ లో సమంత

టాలీవుడ్, కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సూపర్ హిట్ మూవీ "ఓ .. బేబీ " తరువాత "జాను" మూవీ కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2" వెబ్ సిరీస్ తో సమంత ఫస్ట్ టైమ్ డిజిటల్ ప్లాట్ ఫారం లో అడుగుపెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో సమంత టెర్రరిస్ట్ గా నటించారు. స్టార్ హీరోయిన్ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసిన "జాను" మూవీ పాజిటివ్ టాక్ తో విజయవంతం గా దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
Nishabdham Movie Final Release Date,Nishabdham,Nishabdham Movie,Nishabdham Telugu Movie Release Date,Nishabdham Movie Updates,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Anushka Nishabdham Movie
రిలీజ్ అప్‌డేట్

'నిశ్శబ్దం' రిలీజ్ డేట్ ఖరారు

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Shekhar Kammula Special Valentines Day Gift To Audience
సినిమా వార్తలు

"లవ్ స్టోరి" మూవీ వాలెంటైన్స్ డే కానుక

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న మ్యూజికల్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరి" మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఒక సరికొత్త ప్రేమ కథగా రూపొందుతున్న ఈ మూవీ లో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో ట్రైనింగ్ పొందిన పవన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'టక్ జగదీష్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'నిన్ను కోరి'తో దర్శకుడిగా తొలి అడుగేసాడు శివ నిర్వాణ. మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. గత ఏడాది వేసవికి విడుదల అయిన 'మజిలీ'తో సంచలనం సృష్టించాడు.

Team TFNవాట్సాప్

షేర్