సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `శ్రీమంతుడు` (2015), `భరత్ అనే నేను` (2018) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కట్ చేస్తే… వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి మరో సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అదే ఏడాది చివరలో తెరపైకి వచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే మహేష్, కొరటాల థర్డ్ జాయింట్ వెంచర్ పై మరింత క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాతో కొరటాల శివ బిజీగా ఉండగా, త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు మహేష్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: