శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా.. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్ లో 40 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ సీన్ పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో హీరో కమల్ హాసన్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ షూటింగ్ షెడ్యూల్ అనంతరం చిత్ర యూనిట్ తైవాన్, యూరోప్ లలో షూటింగ్ ప్లాన్ చేశారని సమాచారం.
Super stoked to finally start filming for #Indian2 ! @shankarshanmugh @ikamalhaasan 💕 @LycaProductions pic.twitter.com/pEEDRn4xnB
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 8, 2020
[custom_ad]




ఇక ఈ సినిమాలో కాజల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన షూటింగ్ అప్ డేట్ ఇచ్చింది. ఫైనల్లీ ఇండియన్ 2 షూట్ స్టార్ట్ అయిందని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఇంకా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్ , ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేష్, విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాఅనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ రవి వర్మన్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: