అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు ఈ సినిమాకు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]




కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























