గత ఏడాది తమిళ్ లో వచ్చిన ఓ మై కదువలే ( తెలుగులో ఓ నా దేవుడా) అనే రొమాంటిక్ కామెడీ సినిమా మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన దర్శకుడు అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించగా… షరా, ఎంఎస్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఎన్నో హిట్ చిత్రాలని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సంస్థ సొంతం చేసుకుంది. ఇక ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని పీవీపీ సంస్థ ప్రకటించింది.
We are happy to announce that @PVPCinema has acquired the Telugu remake rights of #OhMyKadavule. More details soon!
@PrasadVPotluri @dir_ashwath @AshokSelvan @ritika_offl @vanibhojanoffl @Dili_AFF @HappyHighPic @leon_james @abinaya_selvam @SakthiFilmFctry pic.twitter.com/jjJ2kJ2Rwi— PVP Cinema (@PVPCinema) February 8, 2020
[custom_ad]




కాగా బలుపు, ఘాజి, మహర్షి వంటి భారీ బడ్జెట్ చిత్రాలనే కాదు.. ఎవరు, ఊపిరి వంటి రీమేక్ చిత్రాలతోనూ నిర్మాతగా సూపర్‌హిట్స్ అందుకున్నారు పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి.పొట్లూరి. మరి ఈ రీమేక్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























