పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచే. అలా మనదేశం కాకుండా పొరుగు దేశం అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. అక్కడికి వెళ్లాలని.. వెళ్లి బాగా సంపాదించాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఈ పరిస్థితి కాస్త తక్కువగా వున్నా… ఇప్పుడు మాత్రం కొంతమంది పేరెంట్స్ చిన్నప్పటినుండే తమ పిల్లలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే పాయింట్ తో ఓ సినిమా వస్తుంది. అదే ‘ప్రెషర్ కుక్కర్’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుజోయ్ అండ్ సుషీల్ దర్శకత్వంలో సాయి రోనక్, ప్రీతి అష్రాని జంటగా రూపొందుతున్న సినిమా ‘ప్రెషర్ కుక్కర్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
[custom_ad]




కాగా ఇంకా ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, రాజై రోవన్, తనికెళ్ల భరణి, సీవీఎల్ నరసింహారావు, సంగీత, ప్రభావతి, ఝాన్సీ, రవివర్మ, కిరీటి, లావణ్యారెడ్డి నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో, కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా కి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 21న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























