ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తా..!

Manchu Vishnu Makes Fun Of Sai Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Manchu Vishnu,Sai Tej,Vishnu Manchu Gives A Hilarious Counter To Sai Dharam Tej,Sai Dharam Tej,Manchu Vishnu Funny Comments on Sai Tej

మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ తో సాయితేజ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సాయి తేజ్. ప్రస్తుతం సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతుంది. `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించ‌నున్నారు. ఇక ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోలోగా ఉంటే వచ్చే లాభాలను తెలియజేస్తూ సాయి తేజ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. సోలో లైఫ్ వల్ల వుండే ఉపయోగాలు ఏంటో పెద్ద లిస్ట్ నే షేర్ చేశాడు. అంతేకాదు..’సింగిల్ ఆర్మీ జీవితాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ తన అభిమానులను కోరాడు. ఇక ఈ పోస్ట్ పై మంచు విష్ణు స్పందించి చమత్కరించాడు. ‘తమ్ముడూ సాయి తేజ్.. నువ్వు పెట్టిన ఈ ట్వీట్ ని నేను సేవ్ చేసుకున్నా.. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తాగా…. ఆల్ ది బెస్ట్ ఫర్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అని సరదాగా కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన సాయి తేజ్.. ‘విష్ణు అన్నా.. అందరూ నీలాగా అదృష్టవంతులు ఉండరు కదా’ అని బదులిచ్చాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =