వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ఈ ఏడాది మొదట తూట అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ వెంటనే ‘పటాస్’ తో వచ్చాడు. ధనుష్ ద్విపాత్రాభినయంలో.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఈనెల 15వ తేదీన విడుదలై ఈ సూపర్ హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది. ఇక ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లోకల్ బాయ్’ అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మరి తమిళ్ లో హిట్ అయిన సినిమా తెలుగులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డీ 40 పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు ధనుష్. దీనితో పాటు మరో సినిమాను సెల్వరాజ్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి కర్ణన్ అనే పేరు పెట్టారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ నటి రజిష విజయన్ హీరోయిన్ గా నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























