నటసింహ బాలకృష్ణ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న `యన్.బి.కె. 106` ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళనుంది. బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఈ నెల 26 నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందట. వారణాసి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనుండగా.. ఒక పాత్ర కోసం అఘోరాగా కనిపిస్తాడని టాక్. ఇక ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో శ్రియ, నయనతార ఆ పాత్రల్లో నటిస్తారని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అంతేకాదు.. శరవేగంగా సినిమాని పూర్తిచేసి జూలై నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: