“తలైవి ” మూవీ సెట్స్ లో కంగనా రనౌత్

Actress Kangana Ranaut To Join Thalaivi Movie Shoot Today

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా , లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ “తలైవి” మూవీ కి కథను అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లెజెండరీ పొలిటికల్ లీడర్ జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “తలైవి” మూవీ ఆఖరి షూటింగ్ షెడ్యూల్ చెన్నై లో ఈ రోజు ప్రారంభమయ్యింది. కంగనా రనౌత్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. నిర్మాతలలో ఒకరైన శైలేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఈ రోజు నుండి డిసెంబర్ 10 వ తేదీ వరకూ జరిగే షూటింగ్ తో “తలైవి” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని తెలిపారు. ఈ షూటింగ్ షెడ్యూల్ లో దర్శకుడు విజయ్ , కంగనా రనౌత్ పై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని “తలైవి” మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =