రాధే శ్యామ్ సెట్స్ నుండి స్నీక్ పీక్ వీడియో

Director Radhakrishna Kumar Shares Sneak Peek Video Of Radhe Shyam Movie Sets On Instagram

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చి ఒక వారం గ్యాప్ తీసుకొని అప్పుడే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టేసారు చిత్రయూనిట్. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేజర్ పోర్షన్స్ పూర్తి చేసుకోగా మొత్తం షూటింగ్ ను ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ రాధా కృష్ణ సెట్స్ లో ఉన్న ఒక చిన్న స్నిక్ పీక్ వీడియో ను పోస్ట్ చేసాడు.

కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − five =